23-08-2025 12:12:59 AM
తెల్లవారుజాము వరకు బంధువుల ఆందోళన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గజ్వేల్, ఆగస్టు 22: గజ్వేల్ పట్టణంలో మరో ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. జగదేవ పూర్ మండలం ఇటి క్యాల గ్రామానికి చెందిన కంతి ఈశ్వరమ్మ (55) బంధువుల విందులో పాల్గొంది. ఆకస్మాత్తుగా సాయంత్రం కడుపు నొప్పి రావడంతో స్థానిక వైద్యుని సంప్రదించగా గజ్వేల్ కు తీసుకువెళ్లాలని సూచించడంతో లైఫ్ క్యూర్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.
హాస్పిటల్‌లోని వైద్యులు ఈశ్వరమ్మ బంధు వులు కోరడంతో వైద్యం ప్రారంభించారు. వైద్యంలో భాగంగా రెండు ఇంజక్షన్లు ఒక స్లున్ ఈశ్వరమ్మకు ఇచ్చారు. బంధువులను కౌంటర్లో బిల్లు కట్టాలని సూచించడంతో బంధువులు బిల్లు కట్టడానికి వెళ్లారు. బిల్లు కట్టి వచ్చేలోగా ఈశ్వరమ్మ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈశ్వరమ్మ మృతి చెందిందంటూ ఆరోపిస్తూ మృతు రాలి బంధువులు ఆసుపత్రి ముందు గురు వారం రాత్రి 10 గంటల నుండి శుక్రవారం వేకువ జాము వరకు ఆందోళన చేశారు.
కాగా లైఫ్ క్యూర్ హాస్పిటల్ నిర్వాహకులు ఈశ్వరమ్మ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్కు తరలించాలని బంధువులకు సూచించామని, కానీ వారికి అందుబాటులో వాహనం లేకపోవడం వల్ల అప్పటివరకు వైద్యం అందించాలని బ్రతిమి లాడారన్నారు. అందువల్ల వైద్యులు ప్రమా దంలో ఉన్న రోగికి వైద్యం అందించాలన్న సదుద్దేశంతో వైద్యం చేశారని, ప్రమాదవ శాత్తు ఈశ్వరమ్మ మృతి చెందిందని, దీంట్లో వైద్యుల తప్పేమీ లేదని వెల్లడించారు.