23-08-2025 12:21:47 AM
నారాయణఖేడ్, ఆగస్టు 22: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేశారు.
రైతులకు అందిస్తున్న పథకాలతో పాటు నిరుద్యోగ యువకుల కొరకు బర్రెల షెడ్లు, మేకల షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గం లోని నాగదర్, నిజాంపేట్, మాధ్వార్ తదితర గ్రామాల్లో పర్యటించి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.