calender_icon.png 23 August, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఎస్ఓ సస్పెండ్

23-08-2025 12:08:01 AM

విజయక్రాంతి వార్త కథనానికి స్పందించిన కలెక్టర్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా  పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి(ఎస్ఓ) లతను ఉన్నతాధికారులు శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బాలికల విద్యాలయంలో ఆమె విధులకు సక్రమంగా రాకపోవడం,  మెనూ  ప్రకారంగా భోజనం పెట్టకపోవడం, రాత్రివేళ విధులకు గైరాజర్ కావడం, స్టాక్ రిజిస్టర్లను మెయింటెనెన్స్ చేయకపోవడం తదితర అంశాలపై గతేడాది నవంబర్ నెలలో విజయక్రాంతి పలు కథనాలు ప్రచురించి వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపిన అధికారులు  నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించడంతో సమగ్ర దర్యాప్తు అనంతరం సస్పెన్షన్ రేట్ వేస్తూ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్  ఉత్తర్వులు ఇచ్చారు.