13-01-2026 01:26:21 AM
వివేకానంద జయంతి వేడుకల్లో ఎంపీ నగేష్
ఉట్నూర్, జనవరి ౧౨ (విజయక్రాంతి): రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించుకోవచ్చునని, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. సోమవారం ఉట్నూరు మండలం హస్నాపూర్‌లో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని గ్రామ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వర్షా తాయి, గ్రామ పెద్దలు స్వామి, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.