13-01-2026 01:27:44 AM
నేడే జాతర ఏర్పాట్లపై సమీక్ష
ఉట్నూర్, జనవరి 12 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని కేస్లాపూర్ లోని ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబాకు పూజలు నిర్వహించే మెస్రం వంశస్థులు వచ్చే రహదారులు నేటికీ మరమ్మత్తు లకు నోచుకోలేదు. ఇంద్రవెల్లి మండల కేం ద్రంలోని ఇంద్రాయి దేవతకు మెస్రం వంశీయులు మొక్కులు తీర్చుకొని ఎడ్లబండతో కేస్లాపూర్ కు చేరుకునే ప్రధాన రహదారి హార్కాపూర్ నుంచి కేస్లాపూర్ రహదారి పూర్తి గా గుంతల మయం అయింది. ఈ రహదారి తో పాటు నాగోబా ఆలయానికి వచ్చే నాలు గు రహదారులను భక్తులకు గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా మరమ్మత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను అధికారులు నిధులు లేవని మరమ్మ త్తులు చేపటకు ముందుకు రావడం లేదు. మెస్రం వంశస్థులు ఎడ్లబండ్లతో పాటు కాలి నడకగా వచ్చే ప్రధాన రహదారి పైపడిన గుం తలను సైతం పూడ్చి మరమ్మత్తులు చేయించడంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. సిరికొండ మండల కేంద్రం నుంచి కేస్లాపూర్ కు వచ్చే తారు రోడ్డుపై పడిన పెద్ద గుంతలను పొక్లియన్ పూడిపించారు. పొక్లిన్ తో గుంతలను పూడ్చడంతో రాళ్లు పైకి వచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెండు రోజుల్లో రహదారులకు మరమ్మత్తులు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.