22-09-2025 01:27:56 AM
పీఎస్‌ఆర్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం
మంచిర్యాల, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడినవారవుతారని కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
రక్తదానం చేయడం ద్వారా గర్భిణులకు ప్రసవ సమయంలో, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర పరిస్థితులలో వారి ప్రాణాలను కాపాడవచ్చ న్నారు. స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.