calender_icon.png 26 August, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం

03-07-2024 01:16:20 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ 

11 మంది నక్సల్స్ మృతి

అడవిని జల్లెడ పడుతున్న 1400 మంది పోలీసులు

నారాయణ్‌పూర్, జూలై 2: దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ౧౧ మంది మావోయిస్టులు మరణించారు. నక్సల్స్‌ను పూర్తిగా నిర్మూలించటమే లక్ష్యంగా ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాదాపు ౧౪౦౦ మంది పోలీసులు, స్పెషల్ పార్టీ జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు. నారాయణపూర్ సమీపంలో ఖోకామేట పోలీస్ స్టేషన్ పరిధి కుర్రేవాయి అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతాబలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11 మంది నక్సలైట్లు మృతి మరణించినట్టు, అనేక మంది గాయపడినట్టు ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. సోమవారం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. 

వరుస ఎన్‌కౌంటర్లు

మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. అన్నట్టుగానే చేస్తున్నా రు. దండకారణ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు వందమందికిపైగా మావోయిస్టులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. వరుస ఎన్‌కౌంటర్లతో నక్సల్స్‌కు నిలువ నీడ లేకుం డా చేస్తున్నారు. ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయి. పోలీసుల దాడుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా చనిపోయారు. ఛత్తీస్‌గఢ్‌తోపాటు పొరుగున ఉన్న జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కూడా ఏకకాలంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతున్నది.