05-05-2025 02:35:13 AM
కామారెడ్డి, మే 4 (విజయ క్రాంతి), ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నాడ ని డయల్ 100 కు ఫోను రావడంతో బ్లూ కాట్ సిబ్బంది వెంటనే స్పందించారు. కా మారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజాము న ఒంటిగంట ప్రాంతంలో డయల్ 100 ఫోన్ రావడంతో డ్యూటీలో ఉన్న పోలీస్ కాని స్టేబుల్ భరత్ ,హోమ్ గార్డ్ సతీష్ వెంటనే స్పందించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడు తున్న వ్యక్తి ఉన్న స్థలానికి బాన్సువాడ లో నిగూడెం గల్లీ కి చేరుకోగా ఇంట్లో ఫ్యాన్ కు లుంగీ కట్టి మెడకు చుట్టుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న అతనిని వెంటనే కిందకి దింపి ప్రాణాలను రక్షించారు.
అనంతరం అతనితో చర్చించి మానసికంగా ధైర్యం చెప్పి కౌన్సిలిం గ్ అందిం చారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా పోలీస్ సూపరిండెంట్ రాజేష్ చంద్ర ప్రాణం కాపాడిన బ్లూటూత్ సిబ్బంది ని అభినందించారు. వారి చొరవ, సేవా దృక్ప థం పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు. ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినట్లు అయిందన్నారు.