14-05-2025 12:00:00 AM
పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ మృతి
మాండ్య, మే 13: భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్(70) కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నం సమీపంలోని కావేరి నదిలో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. అయ్యప్పన్ వ్యవసాయం, మత్స్య(ఆక్వాకల్చర్) శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌కు నాయకత్వం వహించిన మొద టి పంటయేతర శాస్త్రవేత్త కావడం గమనా ర్హం.
గత శనివారం నదిలో తేలుతున్న ఆయ న మృతదేహాన్ని స్థానికులు గ మనించి పోలీసులకు సమాచారం అందించారు. అయ్య ప్పన్ మృతిపై పోలీసులు మాట్లాడుతూ.. ఆయన బైక్ నది ఒడ్డున కనపడిందని, నదిలోకి దూకి ఆ త్మహత్య చేసుకోవచ్చని అను మానం వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం అయ్యప్పన్ మృతికి సంబంధించిన పూర్తివివరాలు తెలిసే అవకాశం ఉం టుందని వెల్లడించారు.
ఈ నెల 7న అయ్యప్పన్ కనిపించడంలేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయ్యప్పన్ మైసూర్ విశ్వేశ్వరనగర్ ఇండస్ట్రియల్ ప్రాంత నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయ్యప్పన్ 2022లో పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. ఇంఫాల్‌లోని కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా కూడా పనిచేశారు.