14-05-2025 12:00:00 AM
ఇస్లామాబాద్, మే 13: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తమ సైన్యానికి చెందిన 11 మంది సైనికులు మరణించినట్టు పాక్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 11 మంది సైనికులు మరణించడమే కాకుండా మరో 78 మంది తీవ్రంగా గాయపడినట్టు అందు లో ఉంది. ఈ 11 మందిలో పాకిస్థాన్ వా యుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ఉ న్నారని తెలిపింది.
కేవలం సైనికులు మా త్రమే కాకుండా 40 మంది సామాన్య పౌరు లు చనిపోగా.. మరో 121 మంది పౌరులు గాయాలపాలయ్యారని పేర్కొంది. పాక్‌కు చెందిన ఓ యుద్ధవిమానం స్వల్పం గా ధ్వం సమైనట్టు ఇప్పటికే ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా ఎంత మేర నష్టం జరిగిందనే వివరాలను ఆర్మీ వెల్లడించలేదు.
వాయుసేనకు చెందిన స్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, సీనియర్ టెక్నీషియన్ ముబషీర్, నజీబ్, కార్పొ రల్ టెక్నీషియన్ ఫరూఖ్ ఉన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రస్థావరాలపై చేపట్టిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.