13-09-2025 12:09:56 AM
భద్రాచలం,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( అటానమస్ )భద్రాచలంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం నందు చేరుటకు సెప్టెంబర్ 15,16 తేదీలలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించ బడునని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జాన్ మిల్టన్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన లేదా తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలో సమర్పించి అడ్మిషన్ పొందగలరని ఆయన అన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ యొక్క చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారం కొరకు దోస్త్ ఇంచార్జి డాక్టర్ ఏ. శ్రీను ఫోన్ నెంబర్ 9291491507 సంప్రదించగలరని ఆయన కోరారు.