13-09-2025 12:13:55 AM
సంగారెడ్డి ఎమ్మెల్యేచింతా ప్రభాకర్
సంగారెడ్డి,(విజయక్రాంతి): త్రిబుల్ ఆర్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను కోరారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ప్రావిణ్యకు కొండాపూర్ రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, అలియాబాద్, మారేపల్లి, మాచేపల్లి, గంగారం శివన్న గూడెం, రాంపూర్ తండా గ్రామ పరిధిలో నీరు పేద రైతులు కోపోతున్న భూములపై జీవనం కొనసాగిస్తున్నారు. పట్టా భూములు ఆర్.ఆర్.ఆర్ రోడ్డు మరమ్మతులో కోల్పోకుండా నీరు పెద రైతులను కాపాడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు.
ఆర్ఆర్ఆర్ లో పట్టా భూములు కోల్పోవడంతో మండలంలోని నీరు పెద రైతులు రోడ్డున పడతారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు. రైతుల మంచి కోరే ప్రభుత్వం, రైతులను రోడ్డునా పడేసి ఆర్ ఆర్ ఆర్ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులను సంతృప్తి చేసే విదంగా ఆర్ ఆర్ ఆర్ విధానాలు ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతే జీవింతచడం భారంగా ఉందని భూములు కోల్పోతున్న రైతుల గురించి ఆలోచించాలని కోరారు. కొండాపూర్ మండల పరిధిలో ఆర్ఆర్ఆర్ లో కోల్పోతున్న భూములను అలైన్మెంట్ చేంజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు.