13-09-2025 12:06:29 AM
అధికారులకు సూచించిన జగ్గారెడ్డి
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి ప్రజలకు శుభ్రత, నాణ్యత తో కూడిన సరిపడా మంజీరా నీళ్ళు అదనంగా సరఫరా చేసేందుకు 200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయాలని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులకు టి ఐ సి సి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. అదనంగా కొత్త ఫిల్టర్ బెడ్, కొత్త ఇంటెక్ వెల్ నిర్మాణం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలప్పుడు ఉదయం, సాయంత్రం అదనంగా రెండు గంటల పాటు మంజీరా నీళ్ళు ఇవ్వాలని, సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ కు అదనంగా మరో ఫిల్టర్ బెడ్, ఇంటెక్ వెల్ నిర్మించాలనీ ప్రతిపాదించారు.
అవసరమైన చోట కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్స్, ట్యాంక్ ల నిర్మాణం చేపట్టాలని, ఇరిగేషన్ అలకేశన్ అవసరం ఉందని అధికారుల సూచించారు. సంగారెడ్డి పట్టణ శివారు గ్రామాలైన కల్పగురు, కులబ్ గురు, తాల్లపల్లి, గంజి గూడెం, ఇరుగు పల్లి, కోత్లపూర్, ఫసల్ వాది తదితర గ్రామాల వరకు త్రాగు నీటి సరఫరా ఉండేలా డిజైన్ చేయాలన్నారు. రానున్న యాభై ఏళ్ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీ కి ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని, ఇరిగేషన్, ఆర్ డబ్లు ఎస్ అధికారులతో కలిసి మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు నిరనయించారు. ఉమ్మడి రాష్ట్రం లో సంగారెడ్డి మున్సిపాలిటీ కి ప్రత్యేకంగా మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చానని, రాష్ట్ర విభజన తర్వాత మంజీరా వాటర్ స్కీమ్ ను నాశనం చేశారన్నారు.
మంజీరా వాటర్ స్కీమ్ స్థానంలో మిషన్ భగీరథ ను తెచ్చి వాటర్ సరఫరా కు ఇబ్బందులు తెచ్చారన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజీరా స్కీమ్ ఇచ్చిన మాదిరిగా నీటి సరఫరా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంటూ అధికారులను అడిగి జగ్గారెడ్డి తెలుసుకున్నారు. ఇప్పుడున్న రెండు మోటార్ల స్థానంలో మరో రెండు కొత్త మోటార్లు కావాలనీ కోరిన అధికారులు కోరారు. పండుగల రోజు ఉదయం, సాయంత్రం రెండు గంటలు మంజీరా నీరు రావాలని అధికారులను జగ్గారెడ్డి ఆదేశించారు. మిషన్ భగీరథ పై ఆధారపడకుండా జగ్గారెడ్డి మంచి నీటిని సరఫరా చేయాలన్నారు.
కొంత మేర మిషన్ భగీరథ పై ఆధారపడాల్సి వస్తుందని అధికారులు తెలియజేసారు. ఉమ్మడి రాష్ట్రంలో మిషన్ భగీరథ కు సంబంధం లేకుండా మంజీరా నీరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అని అధికారులను జగ్గారెడ్డి ప్రశ్నించారు. కారణం ఏంటి? మంజీరా వాటర్ స్కీమ్ లో ఎందుకు అప్పుడు మార్పులు చేయాల్సి వచ్చిందని అధికారులను అడిగి జగ్గారెడ్డి ఆరా తీసారు. మిషన్ భగీరథ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా పాత మంజీరా వాటర్ స్కీమ్ మాదిరిగా నేరుగా సంగారెడ్డి మున్సిపాలిటీ కి మంజీరా నీళ్ళు సరఫరా చేయాలని, ఇది నా టార్గెట్ అని అధికారులకు జగ్గారెడ్డి తెలియజేసారు. రాజం పేట ఫిల్టర్ బెడ్, ఇంటెక్వెల్ పునరుద్దరణ కు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఫిల్టర్ మీడియా ను రీప్లేస్ చేసే అవసరం ఉందని అధికారులు జగ్గారెడ్డి తెలియజేసారు.