calender_icon.png 9 January, 2026 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో దొంగ ఓట్లను తొలగించాలంటూ...

06-01-2026 05:10:08 PM

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా...

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించి బాన్సువాడ పట్టణంలో నివసిస్తున్న వారి ఓట్లను  చేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ... బాన్సువాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమని, 9వ వార్డులోని ఓట్లను ఒకటో వార్డులోకి, ఆరో వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు సైతం మున్సిపాలిటీలో ఓట్లు వేసేందుకు ఓటర్లుగా నమోదు కావడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు బాన్సువాడ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలక్టర్ కిరణ్మయికి  మెమొరాండం ఇవ్వడం జరిగింది.