calender_icon.png 8 January, 2026 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సబ్ స్టేషన్ ల పనులు త్వరలో ప్రారంభం: ఏడి శంకర్ నాయక్

06-01-2026 05:12:49 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలో రెండు విద్యుత్ సబ్స్టేషన్ల పనులు త్వరలో ప్రారంభం అవుతాయని తాండూర్ విద్యుత్ శాఖ ఏడి శంకర్ నాయక్ తెలిపారు. మండల పరిధిలోని పాషాపూర్, కొండాపూర్ గ్రామాల పరిధిలో నాలుగు కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేసి గృహ వినియోగదారులకు, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం రెవెన్యూ అధికారుల అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.