26-08-2025 02:31:38 AM
గాజా, ఆగస్టు 25: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా సోమవారం దక్షిణ గాజాలోని నాసర్ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో జర్నలిస్టులతో సహా 20 మంది మృతి చెందా రు. ‘దక్షిణ గాజాలోని నాసర్ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరిపాయి. ఈ దాడు ల్లో జర్నలిస్టులు, వైద్యులు, రక్షణ సిబ్బందితో సహా సాధారణ పౌరులు కూడా మరణించారు.
చాలా మందికి గాయాలయ్యాయి’ అని గాజా ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపా యి. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 58కి చేరుకుంది. మరో 308 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆస్పత్రిపై దాడి చేయడం మాత్ర మే కాకుండా డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ ప్రయోగించింది. డ్రోన్ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో ఓ వ్యక్తి మరణించాడు.
మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు
ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన వారి లో పాలస్తీనాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు. వారిలో అంతర్జాతీయ మీడి యా సంస్థ అల్‌జజీరాకు చెందిన జర్నలిస్టు మహ్మద్ సలామాతో పాటు హుస్సామ్ అల్ -మస్రీ (రాయిటర్స్), మరియం అబు దక్ (ఫ్రీలాన్స్), మొయిజ్ అబూ తాహ, అహ్మద్ అబూ అజీజ్ మరణించారు. కొంత మంది రెస్క్యూ సిబ్బంది కూడా ఈ దాడిలో మరణించారు. 22 నెలల నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధం వల్ల గాజాలో మరణించిన వారి సంఖ్య 62,744కు చేరుకుంది. 1,58,259 మంది గాయాలపాలయ్యారు. 192 మంది జర్నలిస్ట్‌లు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి నట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా అ మెరికా నోరు మెదకపోవడం గమనార్హం.