26-08-2025 02:25:18 AM
సవాయి మాధోపూర్ జిల్లాలో 2 కిలోమీటర్ల గొయ్యి
ఎడతెరిపి లేని వానలతో జనజీవనం అస్తవ్యస్తం
జైపూర్, ఆగస్టు 25: రాజస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి సవాయి మాధోపూర్ జిల్లాలోని సుర్వాల్ డ్యామ్ నిండు కుండలా మారింది. డ్యామ్‌లోని నీరు పొంగిపొర్లడంతో జవదత ప్రాంతంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి ప్రస్తుతం ఓ జలపాతాన్ని తలపిస్తోంది. 2 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతుతో భారీ గొయ్యి ఏర్పడటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. నీటి ఉధృతికి రెండు ఇండ్లు, అనేక దుకాణాలు, రెండు దేవాలయాలు కూడా కూలిపోయినట్టు ప్రకటించారు.
ఆదివారం రాజ స్థాన్‌లోని అనేక గ్రామా ల్లో వరద విలయతాండవం చేసింది. భారీ వ ర్షాల వల్ల పరిస్థితులు దిగజారడంతో భద్రతాబలగాలు, పోలీసులు, ఎన్డీ ఆర్‌ఎఫ్ బృందాలు రం గంలోకి దిగాయి. గ్రామస్తులను సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే కరోడి లాల్ మీనా పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహా యక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.