calender_icon.png 16 August, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్‌లో శాంతియుతంగా బోనాల పండుగ జరుపుకోవాలి

24-07-2025 11:06:07 PM

మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి..

బోడుప్పల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాబోయే బోనాల పండుగ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి(Inspector Govinda Reddy) ఆధ్వర్యంలో ఆలయాల చైర్మన్ లతో, ఆర్గనైజర్లతో గురువారం సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ, శాంతియుతంగా బోనాల పండుగను జరుపుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఫలారం బండ్లు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు చేసే ముందుగా పోలీస్ స్టేషన్ లో తెలియపరచాలని తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయాల చైర్మన్లు, ఆర్గనైజర్లు, స్థానిక నాయకులు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.