calender_icon.png 2 August, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బోనాలు

02-08-2025 01:30:05 AM

మేడ్చల్, ఆగస్టు 1 (విజయ క్రాంతి):  మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టరేట్ ఆవరణలో బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రాంగణంలోని శ్రీ మాతా భువనేశ్వరి అమ్మవారి దేవాలయంలో బో నాల సందర్బంగా  జిల్లా కలెక్టర్ మిక్కినినేని మను చౌదరి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి పూజల్లో పాల్గొన్నారు. 

అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అధికారులు, తొటి ఉద్యోగులు పోతురాజుల విన్యాసాలతో ఉరేగింపుగా సాగి అమ్మవారికి బోనాలు  సమర్పించారు.  అమ్మవారి బోనాల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఆలయ మర్యాదలతో నిర్వహించారు.  ఎస్సీ వెల్పెర్ అధికారి, జిల్లా టిజిఓ అధ్యక్షులు జి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఏర్పాటు చేపట్టారు.

రాష్ట్ర ఆద్యక్షులు ఏలూరి శ్రీనివాస్రావు, కార్యదర్శి ఎ. కురుమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో  లా ఆఫీసర్ ఆర్.ఎస్. చంద్రవతి,  డిఆర్డిఎ సాంబశివరావు, జెడ్పీ సిఇఓ కాంతమ్మ,  కలెక్టరే ట్ పరిపాలన రామోహన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి యం. రాధిక,  బీసీ వెల్ఫేర్ అధికారి ఝాన్సీ లక్ష్మి, సివిల్ సప్లై డిఎం సుగుణ బాయ్, వివిధ శాఖల జిల్లా అధికారలు, ఉద్యోగులు తదితరలు పాల్గొన్నారు.