02-08-2025 01:28:46 AM
మేడ్చల్, ఆగస్టు 01(విజయ క్రాంతి): శామీర్పేటలోని మహత్మాగాంధీ జ్యోతి రావ్ పూలే వెనుకబడిన తరగతులు బాలుర గురుకుల పాఠశాల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్దులతో ముచ్చటిస్తూ పాఠశాల దశలనే విద్యార్దులు లక్ష్యాలను ఎంచుకుని, దానికి అనుగుణంగా సాధించేందుకు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోని, ఎలాంటి అవరోదాలు వచ్చినా వాటిని అదిగమించి,
అనుకున్న లక్ష్యాలను చేదించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు ఎంతగానో మానవాళికి ఉపయోగపడుతున్నాయని, గ్లొబల్ వార్నింగ్ నుండి మానవాలిని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని కాపాడు కోవల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని అన్నారు.
దీని వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా పర్యావరణాన్ని పరిరక్షించబడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సి పల్ రజినీకాంత్, శామీర్ పేట తహాశీల్దార్ యాదగిరి రెడ్డి, మున్సిపల్ ఇఇ కన్నేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రూపా, విద్యార్దులు, తదితరులు పాల్గొన్నారు.