calender_icon.png 21 July, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు

21-07-2025 12:38:06 AM

  1. వైభవంగా ఆషాడ మాసం బోనాల జాతర

ఆకట్టుకున్న మహంకాళి.. పోతరాజుల విన్యాసం..

ఆదిలాబాద్, జూలై 20 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా సా గుతున్నాయి. జిల్లా కేంద్రంలో అఖిల గాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక బోనాల శోభాయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బోనాలు జాతరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు.

ముందుగా గాండ్ల కులస్థులతో కలిసి బోనాల కుండలకు ప్రత్యేక పూజలు చేసి, బోనం కుండను తలపై ఎత్తుకొని శోభయాత్రలో పాల్గొన్నారు. బోనాల జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారు, పోతరాజులు, పెద్దపులి వేషధారణలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్వాడి ధర్మశాల నుండి పట్టణ పురవీధుల గుండా అశోక్ రోడ్ లోని పెద్ద పోచమ్మ వరకు శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది.

డీజే బోనాల పాటలకు అనుగుణంగా  మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి, మొక్కలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ...

మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు పండగ నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో గాండ్ల కుల సంఘం నాయకులు, కులస్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి: మంత్రి వివేక్

మందమర్రి, జూలై 20 : అమ్మ వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. మండలం లోని  వెంకటాపూర్ గ్రామపంచాయతీలో ఆదివారం నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ  రాష్ట్ర ప్రజలు  సంపూర్ణ ఆరోగ్య వంతులుగా,  సుఖ సంతోషా లతో జీవించాలని కోరుతూ అమ్మవారికి పూజలు నిర్వహించినట్లు తెలిపారు.అమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి నిరంతరంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొట్టే సంపత్ కుమార్,  మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్

మంచిర్యాల, జూలై 20 (విజయక్రాంతి): ఆషాడ బోనాల సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సీసీసీ కార్నర్‌లోని శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో నిర్వహించిన ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల సందర్భంగా మహిళలు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు తో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

బోనం ఎత్తుకున్న ఆర్‌ఎస్పీ

కాగజ్‌నగర్, జూలై 20(విజయ క్రాంతి):బోనాల వేడుకల సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం కాగజ్ నగర్ మండలం కోసిని లోని తన స్వగృహం  నుండి బోనం ఎత్తుకొని గ్రామస్తులతో కలసి పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, మహిళ నాయకులు లలిత, కమల, రమాదేవి, నక్క మనోహర్, జాక్ తదితరులు పాల్గొన్నారు.

సల్లంగా చూడు పోచమ్మ తల్లి..

బెల్లంపల్లి అర్బన్, జూలై 20 : బెల్లంపల్లి పోచమ్మ టెంపుల్ భక్తులతో కిటకిటలాడింది. ఆషాడ మాసాo చివరి ఆదివారం  ఆషాడం బోనాల పండుగ అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రజలు బోనాలతో నైవే ద్యం సమర్పించారు. బోనాలతో పోచమ్మ టెంపుల్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. చల్లంగా చూడు తల్లి అని భక్తులు వేడుకున్నారు. 

ఘనంగా కట్ట పోచమ్మ బోనాలు

మంచిర్యాల, జూలై 20 (విజయక్రాంతి) : పట్టణంలో ఆదివారం అఖిల గాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో కట్ట పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల పండుగకు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బోల్లం అన్నపూర్ణ, రోజా రాణి హాజరయ్యారు. మంచిర్యాల పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బోనాలు పండుగకు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సంగం చంద్రమౌళి, కోశాధికారి గుండ్ల సదానందం, ఉపాధ్యక్షులు ఆమనగంటి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గుజేటి బుచ్చయ్య, సంయుక్త కార్యదర్శి వెన్నంపల్లి సతీష్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఆంజనేయులు, సహాయ కార్యదర్శి సంద అంజి, అధికార ప్రతినిధి వెన్నం పల్లి రవీందర్ పాల్గొన్నారు.