15-12-2025 12:55:25 AM
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల ౧౮వ తేదీ సాయంత్రం ౫ గంటలకు డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్ రచన ‘భానుమతి’ నవల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. నవలను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు ఆవిష్కరిస్తారు. సభాధ్యక్షుడిగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలాచారి వ్యవహరిస్తారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి విచ్చేస్తారు. విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ పులికొండ సుబ్బాచారి నవలను సభికులకు పరిచయం చేస్తారు.
*****
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బుక్‌ఫెయిర్- తె లంగాణ కళాభారతి వేదికగా ఈనెల ౨౩న రాత్రి ౮ గంటలకు డాక్టర్ కాసుల లింగారెడ్డి కవిత్వ సంకలనం ‘ఆకుపచ్చ కల’ పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. సభకు కాసుల ప్రతాపరెడ్డి అధ్యక్షత వహిస్తారు. పుస్తకాన్ని సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్ ఆవిష్కరిస్తారు. సమన్వయకర్తగా గాజుల శ్రీధర్ వ్యవహరిస్తారు.