15-12-2025 12:53:20 AM
కణాల్లో సాగే రక్త ప్రవాహం
నర నరాల్లో పారే ప్రాణద్రవం
చుక్కలు చుక్కలుగా చిక్కటి నెత్తురు
అస్వస్థ దేహానికి మహా జీవ ధారలు
రక్తనాళాల నిండా ఎర్రెర్రని పారకం
పెయ్యి నిగారింపుకు ప్రాణమయ రూపం
రక్తం ఇస్తే ప్రాణం లేచి వస్తుంది
జీవి నుంచే ఒక జీవితం పుష్పిస్తుంది
రక్తదానం చేయడం అంటే
మనిషికి జీవం పోయడమే కాదు
మనుషులంతా ఒక్కటేనని
జీవశాస్త్రయుక్తంగా నిరూపించడం
దేహ ఉపరితలంపై అల్లుకున్న
కుల మతాల మకిలీలకు అతీతం
స్వచ్ఛమైన నెత్తురును స్వేచ్ఛగా
మనకు మనం ఒకరికొకరి దానం
రక్తనాళాలూ శుభ్రం చేసుకుందాం!
అన్నవరం దేవేందర్