22-12-2025 01:07:25 AM
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్‌ఫెయిర్ (కొంపెల్లి వెంకట్ గౌడ్ వేదిక)లో ఈనెల ౨౫వ తేదీ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రఖ్యాత పర్యావరణ జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ ఆరతికుమార్‌రావు రచన ‘మార్జిన్ లాండ్’కు తెలుగు అనువాదమైన ‘చెరిగిపోతున్న చివరి సరిహద్దులు’ పుస్తకావిష్కరణ సభ జరుగనుంది. కథకుడు తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి ఈ పుస్తకాన్ని అనువదించారు. అలాగే మధురాంతకం నరేంద్ర రచన ‘నీరు పల్లమెరుగు’ పుస్తకావిష్కరణ సభ కూడా ఇదే వేదికపై జరుగనుంది. ఈ రెండు పుస్తకాలనూ ‘ఛాయ పబ్లికేషన్స్’ ప్రచురించింది. ఆవిష్కరణ సభకు పలువురు కవులు, కళాకారులు, ప్రముఖులు విచ్చేయనున్నారు.
******
హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో ఈనెల ౨౮వ తేదీ సాయంత్రం ౫ గంటలకు ‘సింగిడి రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘పగడి’ (తెలంగాణ కథధో పుస్తకావిష్కరణ సభ జరుగనుంది. డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వెల్దండి శ్రీధర్ సంపాదకత్వంలో వెలువరిస్తున్న ఈ కథల సంకలనాన్ని కవులు, రచయితలు డాక్టర్ నందిని సిధారెడ్డి, అనుమాండ్ల భూమయ్య, పరవస్తు లోకేశ్వర్, నస్రీన్‌ఖాన్, సిద్దెంకి యాదగిరి, తాళ్లపల్లి యాకమ్మ ఆవిష్కరిస్తారు.