22-12-2025 01:04:51 AM
చీకటి కమ్ముకున్న వేళ
చిన్న దీపం వెలిగించినట్టు
నాలో ముసిరిన వెతల కథలన్నింటికీ
నీ మాటలతో స్వాంతన దొరికింది !
నీతో నా పయనం కొత్త ప్రపంచంలా అనిపిస్తున్నది
అమవాస్య రాతిరిలోకి చందమామ వచ్చినట్లు
ఒక కొత్త వెలుతురు
నాలో ప్రవేశించింది
నాలోని అలజడులను పారద్రోలింది
మార్పును మనసారా ఆహ్వానిస్తున్నా..
జీవితానికి సరిపడా వెలుతురు రేఖలు నింపుకొంటున్నా..
-బొమ్మిదేని రాజేశ్వరి