15-11-2025 08:46:24 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, రెండవ రోజు పుస్తక ప్రదర్శన గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ గ్రంథాలయ పుస్తక ప్రదర్శనలో గ్రంథాలయ కార్యదర్శి కి.కరణకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ పాఠశాల నుంచి సుమారు నాలుగు వందలు పైగా,విద్యార్థిని విద్యార్థులు పుస్తక ప్రదర్శనకి వచ్చి, పుస్తకములను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుస్తక పఠనతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని కథ పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రను విద్యార్థినే విద్యార్థులకు జ్ఞానం పెంపొందించే పుస్తకాలు ఎన్నో ఉన్నాయని వారి ఖాళీ సమయంలో, గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి వందలాది మంది, విద్యార్థులు వచ్చి పుస్తక ప్రదర్శనను వీక్షించారు. తదనంతరం కార్యదర్శి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయము మొదలుకొని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు, ర్యాలీ తీసి పుస్తక ప్రాధాన్యతను చాటి చెప్పారు.
గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో గ్రంథాలయాలు నేటి దేవాలయాలు అనే నినాదాలు చేస్తూ, ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర కళాశాల అధ్యాపకురాలు పద్మా, గ్రంథపాలకురాలు జి మణిమృదుల, మధుబాబు రుక్మిణి, గ్రంథాలయ సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.