08-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి), సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఆయా గ్రామాల్లో ,పట్టణాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాద గం టీకలు మోగుతున్నాయి. నెలల తరబడి సర్ది, దగ్గు, విష జ్వరాలు జిల్లా ప్రజలను విడడం లేదు. ప్రతి ఇంటిలో ఇద్దరు, ముగ్గురు పేషెంట్ లు గా ఉన్నారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించాల్సిన జిల్లా వైద్యులు ఊసేత్తడం లేదు.
దీంతో ఒకరి నుంచి మరొకరికి విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఆసు పత్రు లు రోగుల తో కిక్కిరిసిపోతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి కామారెడ్డి లో, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణ కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రులతో పాటు పిట్లం, దోమకొండ, గాంధారి, ఉత్తునూరు ప్రభుత్వాసు పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రిలో రోగులు కిటకిటలాడుతున్నారు.
ప్రభుత్వ వైద్యులు మాత్రం ఆస్పత్రికి వచ్చిన రోగులకు సేవలందించి పంపిస్తున్నారు. రోగంకు సంబంధిం చిన మందు గోలీలు కూడా లేవంటూ ప్రైవేట్ మెడికల్ షాప్ లకు మందులు రాసిస్తున్నారు. అంతేకాకుండా విష జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు, చేస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ రక్త పరీక్షల కేంద్రాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.
అంతేకాకుండా చిన్న పిల్లలు, వృద్ధులకు ప్లేట్లెట్లు తగ్గడంతో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలతో బాధపడుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాసుపత్రులనే నమ్ముకొని చికిత్స పొందుతున్నారు. డబ్బు న్న వారు మధ్యతరగతి ప్రజలు కొందరు ప్రైవేటు ఆసుపత్రిలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అందిన కాడికి అక్కరలేని ట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు మెడికల్ షాపుల యజమానులు సైతం డబ్బులు దండుకుంటు న్నారు. ఒకే రోగానికి సంబంధించిన మందు లు రెండు మూడు రకాలుగా ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారికి తమ వద్ద ట్రీట్మెంట్ లేదని మీ ఇష్టం ఉన్న ఆసుపత్రికి వెళ్ళండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని రోగులు వాపోతున్నారు. పర్యవేక్షించి నియంత్రిం చాల్సిన ప్రభుత్వ వైద్య అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు అందిన కాడికి ముక్కు పిండి రోగుల నుంచి డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుం టున్నా ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు వైద్యం పేరుతో రోజుకు బెడ్ ఖర్చు 3600 వేస్తున్నారు. ఏసీ రూములలో వేయాల్సిన బిల్లులు జనరల్ బెడ్ కు ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు వసూలు చేస్తున్నారు.
పేషెంట్ ఆసుపత్రికి వచ్చిం దంటే చాలు వైద్యం పేరుతో భయభ్రాంతులకు గురిచేసి పెద్ద మొత్తంలో వైద్యం పేరిట డబ్బులు దండుకుంటున్నారని దోమకొండకు చెందిన ఓ రోగి బంధువు విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. ఇలాంటి సంఘటనలు నిత్యము ప్రైవేటు ఆసుపత్రిలో వందల సంఖ్యలో రోగులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దోపిడిని పరిశీలించి అరికట్టాలని రోగులు కోరుతున్నారు. కనీసం ఏడాదికి ఒకసారి కూడా ప్రైవేట్ ఆస్పత్రిలోనూ తనిఖీలు చేయడం లేదు. ఏడాదికో సారి ఆస్పత్రి వివరాలను చూయించి మామూలు ముట్ట చెప్పి ప్రైవేట్ ఆస్పత్రిలో యజమానులు ప్రభుత్వ వైద్య శాఖ అధికారుల సంతకాలు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అనవసర టెస్టులు చేస్తూ రోగులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. చిన్నపిల్లల ఆసుపత్రులలో సైతం నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు.
చిన్నపిల్లలను వణికిస్తున్న వైరల్ జ్వరాలు
కామారెడ్డి జిల్లాలో విషాదరాలు చిన్నపిల్లలను వనికిస్తున్నాయి. 90% పిల్లలు సర్ది దగ్గు వైరల్ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళ నకు గురవుతున్నారు. చిన్నపిల్లలు ఏమి చెప్ప లేకుండా ఏడుపులు చేస్తుండడంతో ఆసుపత్రులకు తీసుకువచ్చి అడ్మిట్ చేస్తున్నారు.
ఇదే అదనుగా భావించిన కొందరు చిన్నపిల్లల వైద్యులు అందిన కాడికి బిల్లులు వేసి నిలువునా దోపిడీకి గురి చేస్తున్నారని ఓ చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. మూడు రోజులు అడ్మిషన్ చేసినందుకు ప్లేట్లు లేట్లు తక్కువగా ఉన్నాయని వైద్యులు అడ్మిషన్ చేసుకొని చికిత్స చేసి 20 వేల బిల్లు తీసుకున్నారని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రిలో వేయని బిల్లులు ప్రైవేట్ మిడిల్ ఆసుపత్రుల్లో వేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రులను పర్యవేక్షిస్తున్నాం..
కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు, సర్ది ,దగ్గు వంటి వ్యాధులతో పాటు డెంగ్యూ లక్షణాలు, చికెన్ గున్యా లక్షణాలు రోగుల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స లు అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను సైతం సంవత్సరానికి రెండుసార్లు విజిట్ చేసి పర్యవేక్షిస్తున్నాం. బిల్లుల్లో తేడాలు ఉంటే తమ దృష్టికి తెస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. సీజనల్ వ్యాధులు మాత్రం ఉన్నాయి. రోగులు ఆస్పత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు.
- చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి, కామారెడ్డి