07-01-2026 12:00:00 AM
జహీరాబాద్, జనవరి 6: కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, కోహిర్ మండల మాజీ జెడ్పిటిసి స్రవంతి రెడ్డి లు సొంత డబ్బులు వెచ్చించి బోరు వేయించి మోటార్ బిగించి వినియోగంలోకి తెచ్చారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉండడం వల్ల గ్రామానికి చెందిన ఎస్సీ ప్రజలు మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి స్రవంతి రెడ్డిని నేటి సమస్య పరిష్కరించాలని కోరగా స్పందించిన వారు బోర్ వేయించి మోటార్ బిగించి ప్రజల దాహార్తిని తీర్చారు. తమ సమస్య పరిష్కరించిన నాయకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి, బిలాల్పూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచు నర్సింహులు, గుడిగారి పల్లి గ్రామం బిఆర్‌ఎస్ నాయకులు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.