calender_icon.png 8 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న స్యూరాపేటలో ఉద్యమకారుల మహాసభ

07-01-2026 12:00:00 AM

కాకతీయ యూనివర్సిటీ, జనవరి 6 (విజయక్రాంతి): సూర్యాపేటలో ఈ నెల 10న జరిగే ఉద్యమకారుల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక, తెలంగాణ స్టూడెంట్ జేఏ సీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. అ న్ని యూనివర్సిటీల పర్యటనలో భాగంగా కాకతీయ యూనివర్సిటీని సందర్శించిన విద్యార్థి ఉద్యమ నాయకులు కంచర్ల బద్రి, చార్వాక, రంజిత్, మహిళా ఉద్యమ నాయకురాలు లావణ్యలతో పాటు  వివిధ సంఘా ల ప్రతినిధులు, ఉద్యమ నాయకులు ప్రసంగించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఓయూ జేఏసీ, కేయు జేఏసీ నాయకులు ముందు వరసలో ఉండి ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ఉంది అని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత పాలకులు 10 సంవత్సరాలు ఉద్యమకారులను విస్మరించారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు గడిచిందని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విపలమయ్యారని దుయ్యబట్టారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని, విద్యార్థి సంఘాల ఉద్యమ సంఘాల నేతలు డిమాం డ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ చిలివేరి రాజు, సైంటిఫిక్ స్టడీ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల సుమన్, కాకతీయ యూ నివర్సిటీ అధ్యక్షులు అమర్నాథ్, కార్యదర్శి శర్మ నాయక్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు చుంచు రాజేందర్, బూజగుండ్ల శ్రీనివాస్, డాక్టర్ సుదయ్య, బిసి ఉద్యమ నాయకులు కేడెళ ప్రసాద్, కేయూ విద్యార్థి నాయకులు ఎండి మహబూబ్ పాషా, సు మన్, నరేష్, కవిత, కరుణ,కె. శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.