07-01-2026 12:00:00 AM
హనుమకొండ టౌన్, జనవరి 6 (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు సంస్కృతిక విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు రంగోలి పోటీలను నిర్వహించామని, ఇవి వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని, విద్యార్థులు సంక్రాంతి పండుగను, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగు రంగుల ముగ్గులు వేసి రంగోలి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు.
అనంతరం అత్యుత్తమమైన రంగోలి ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సంస్కృతిక విభాగం కన్వీనర్ డాక్టర్ ఆర్. లక్ష్మీకాంతం, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆఫీసర్లు కవిత, డాక్టర్ వి. మమత, డాక్టర్ జి. సుహాసిని, ప్రొఫెసర్ సునీత, కోఆర్డినేటర్ సురేష్ బాబు, అకాడమీ కోఆర్డినేటర్ అరుణ, వివిధ విభాగాలు అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.