calender_icon.png 18 December, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

18-12-2025 01:32:38 AM

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం 

కల్వకుర్తి టౌన్ డిసెంబర్ 17 : ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ కల్వకుర్తి, ఆమనగల్లు, జిల్లా అందత్వ నివారణ సంస్థ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.

సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాత్ర ఎంతో గొప్పదన్నారు.  కంటి తోపాటు అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు అందజేసి, అవసరం ఉన్నవారికి కంటి శాస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తుందన్నారు.

వైద్య శిబిరంలో 64 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో 16 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని రామ్ రెడ్డి కంటి ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు బావండ్ల వెంకటేష్, లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు  శ్రీధర్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ కిషన్, మాజీ కోశాధికారి శ్రీనివాసు, ప్రచార కార్యదర్శి గణేష్, నాయకులు శ్రీనివాసు, మధు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.