calender_icon.png 27 September, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ

27-09-2025 12:31:33 AM

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయస్థానాల్లో, ఇటు క్షేత్రస్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిందని తెలగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో కొనియాడారు.

శుక్రవారం ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి రాచరిక పాలన, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై ఐలమ్మ పోరాటం చేశారని, తద్వారా మహిళా చైతన్యానికి తోడ్పడిందన్నారు. బహుజన వర్గాల ప్రజాస్వామిక, ఆత్మగౌరవ పోరాట పటిమకు ఐలమ్మ పోరాటం నిదర్శమని పేర్కొన్నారు.