27-09-2025 12:08:16 AM
- ఆల్మట్టి ఎత్తు పెంపు.... తెలంగాణకు పెను ప్రమాదం?
- ఆల్మట్టి ఎత్తు పెంచితే సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులే
- పాలమూరు జిల్లాలో భారీ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించలేమా?
- ఎత్తు పెంచితే పాలమూరు జిల్లా ఎడారి గా మారే ప్రమాదం?
గద్వాల, సెప్టెంబర్ 26 : కర్ణాటక ప్రభు త్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519. 60 నుం చి 524.26 మీటర్లకు పెంచేందుకు చకచకా అడుగులు వేస్తుంది దీనికోసం గాను భూసేకరణ నిమిత్తం 70 వేల కోట్లు కేటాయించిన ట్లు సమాచారం. దీనిపై తెలంగాణలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది డ్యామ్ ఎత్తు పెంపుతో కృష్ణాజిల్లా లభ్యత తగ్గిపోయి పా లమూరు రంగారెడ్డి నల్గొండ వంటి తెలంగాణ దక్షిణ జిల్లాలు ఎడారి గా మారే ప్రమా దం ఉందని నీటిపారుదల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయంపై గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచినట్లయితే కృష్ణా నది పరివాహక ప్రాంతాలైన వనపర్తి గద్వా ల జిల్లాలో మనుగడకి కష్ట సాధ్యమవుతుందని దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించడం జరిగింది. జూరాల పూర్తి సా మర్థ్యం 11 టీఎంసీలు కాగా దాని కింద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాల రిజర్వాయర్లు నీటిని నింపుకునే సామర్థ్యం తక్కువగా ఉ న్నది ఈ మధ్యకాలంలో జీవో 34 ద్వార రేలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకోవడానికి జీవోను ఇష్యూ చేయడం జరిగినప్పటికీ ఇప్పటిదాకా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వలేకపోవడం పలు అనుమానాల కు తావు తీస్తోంది. రేలంపాడు రిజర్వాయర్ ని 15 టీఎంసీల కు గట్టు రిజర్వాయర్ని నాలుగు లేదా ఐదు టీఎంసీలకు నింపే విధం గా సూచనలు చేసినప్పటికీ ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలే దు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది ఎకరాలపై ప్రభావం పడనుండగా భూ గర్భ జలాలు కూడా ఇంకిపోయే ప్రమాదం సైతం ఉంది. గతంలో కూడా కృష్ణా నదిపై కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజె క్టు ఎత్తు పెంపులకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆందోళన జరిగాయి దీనిపై సుప్రీంకోర్టులో వాదన నడుస్తున్నా యి. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మంత్రివర్గ సమావేశంలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 60 మీటర్ల నుండి524.26మీటర్ల ఎత్తు పెంచేలా తీ ర్మానం చేసినట్లు సమాచారం. దీనికి గానీ భూసేకరణలో బాగంగా నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రూ 70వేల కోట్ల మంజురు కు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ విధంగా ఎత్తు పెంచడం వలన మరో జల ఉద్యమం తప్పదని ఇక్కడి రైతులు అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీ లు ఏకతాటి పైకి వచ్చి దీనిపై న గళం విప్పాలని లేకపోతే రై తుల మనుగడకే కష్టసాధ్యం అ య్యే ప్రమాదం పొంచి ఉంది.
భారీ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించలేమా
ప్రత్యేక వానాకాలం సీజన్లో వర్షాలు స మృద్ధిగా పడినప్పటికీ ఆల్మట్టి నారాయణపూర్ నుంచి వచ్చే నీటినీ జూరాల ప్రాజెక్టు ద్వారా నీరు దిగకు వృధాగా వెళుతున్నది త ప్ప దాన్ని ఒడిసి పట్టుకోవడంలో ఎటువం టి ప్రయత్నం చేయడం లేదు. ఈ వర్షాకా లం సీజన్లో ఎగువ నుండి ఇప్పటికే 1159. 72 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశా రు.
ఇక్కడ ఉన్న రిజర్వాయర్ల అయినా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి కేవలం 5 టీఎం సీలు బీమా 1,2 ద్వారా 7 టీఎంసీలు, కోయి ల్ సాగర్ 2 టీఎంసీలు, జూరాల కుడి ఎడమల కాల్వల ద్వారా 7.5 టీఎంసీలు అదేవి ధంగా ఆర్డీఎస్ లింక్ కెనాల్ ద్వారా 0.5టీఎంసీ నీటిని మాత్రమే వాడుకుంటున్నాం. ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకు వదులుతూ సముద్రం పాలవుతు న్నాయి. అలాకాకుండా ఇక్కడనే ఈ నీటిని మళ్లించుకోవడానికి భారీ ఎత్తున ఇప్పుడు ఉ న్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచినట్లయితే ఎక్కువ నీటిని ఒడిసి పట్టుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కా వడం ఆయన దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి రిజర్వాయర్లు సామర్థ్యం పెంచడం గాని కొ త్తగా రిజర్వాయర్లు నిర్మించినట్లయితే భూగ ర్భ జలాలు పెరిగి సుభిక్షంగా ఉంటారు.
జీవోలు జీరో రూపంలోనే ఉన్నాయి..
ఆల్మట్టి ఎత్తు పెం చడంపై జీవో నెంబ ర్ 34 ద్వారా ర్యా లంపాడు గట్టు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోవడానికి జీవోని ఇష్యూ చేయడం జరిగింది కానీ ఈ జీవోలు జీరో రూపంలోనే ఉన్నాయని ఇప్పటిదాకా వీటికి ఆర్థిక శాఖ క్లి యరెన్స్ ఇవ్వలేదు. గతం లోకూడా గు డ్డెం దొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీ ఎంసీలకు పెంచాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ జీవోలు జీరోలుగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణపై సవితి ప్రేమ చూపించింది.. ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కావ డం ఆయన దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కర్ణాటక ప్రభుత్వ పన్నాగాన్ని తిప్పి కొ ట్టాలని దాంతోపాటు రిజర్వాయర్ ని ర్మాణం చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎత్తు పెంపు జరిగితే ఇక్కడి రైతులు జీవన ఉనికి ప్రశ్నార్థకమవుతుందని మరోఉద్యమంతప్పదు.
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గద్వాల నియోజకవర్గ శాసన సభ్యులు