27-09-2025 01:14:38 AM
- మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని సహకార సంఘం మరింత అభివృద్ధి
- సర్వసభ్య సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 2626(విజయక్రాంతి); ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ద్వారానే వ్యాపార వైవిద్యం సాధ్యమవుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మం థని సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 87వ సర్వ సభ్య సమావేశం లో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సహకార సంఘాలు ఆకాశమే హద్దు గా ఏ వ్యాపారమైనా చేయవచ్చని అన్నారు.
ఇందులో భాగంగానే ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దు ద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ గుంజపడుగు గ్రామా శివారులో 4 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారని అన్నారు. రూ.3.50కోట్లతో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా సంఘానికి సంవత్సరానికి సుమారు రూ. 50లక్షల ఆదాయం సమకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల పదవి కాలాన్ని రెండు మార్లు పెంచి తమపై ఎంతో బాద్యతను పెంచిందన్నారు.
బి గ్రేడ్ లో కొనసాగుతున్న మంథని సహకార సంఘం 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో ఏ గ్రేడ్ లోకి వచ్చిందన్నారు. అలా గే గతం లో ఎప్పుడు కూడా సంఘ సభ్యులకు డివిడెండ్ ఇవ్వలేదని, సంఘ చరిత్ర లోనే తమ పాలకవర్గం మొట్టమొదటి సారి డివిడెండ్ ప్రకటించిందని, సహకార సంఘం పురోభివృద్దికి తాము, తమ పాలకవర్గం అహర్నిశలు కృషి చేస్తున్నామని, కరోనా లాంటి విప్పత్తు కాలం లో కూడా సహకార సంఘ ద్వారా రైతులకు ఏ ఇబ్బంది లేకుం డా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సహకార సంఘం లో నూతన ఒరవడి సృష్టిస్తూ సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.
సంఘం ద్వారా నాగా రం శివారు లో రైస్ మిల్ ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాయని, రహదారి సమస్య పరిష్కారం కాగానే మిల్లు నిర్మాణ పనులు చేపడుతామని, సహకార సంఘం ద్వారా గత సీజన్ లో కంటే ఈ సారి ఎక్కువగానే యూరియా అందిoచడం జరిగింద న్నారు. ఇతర ప్రాంతాల్లో యూరియా కొరత ఉన్నప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యెక కృషితో ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతూ కొరత లేకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సంఘ కార్య దర్శి మామిడాల అశోక్ కుమార్ సంఘ జమఖర్చులను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సంఘ చైర్మన్, కార్యదర్శి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నకు సన్మానం
మొట్టమొదటి సారిగా సంఘానికి విచ్చేసిన మంథని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెం కన్న ను, డైరెక్టర్ మేదరవేన ఓదెలు ను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, మాచిడి రా జుగౌడ్, ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్. దాసరి లక్ష్మి-మొండయ్య. ఉడుత మాధవి-పర్వతాలు యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, టీజీఈఆర్సి సలహాదారు’ శశిభూషణ్ కాచే, నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, భూడిద గణేష్, బెజ్జంకి డిగంబర్, రామడుగు మారుతీ, నామని సుగుణ, నాగుల రాజయ్య, ఎరుకల ప్రవీణ్, గొల్లపల్లి శ్రీనివాస్, సాదుల శ్రీకాంత్, బడికెల లింగయ్య, పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.