27-08-2025 12:49:44 AM
మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవాబ్ పేట: సకల జనుల సంతోషమే ప్రజాపాలన లక్ష్యమని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. మంగళ వారం నవాబ్ పేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కోరిన ప్రతి అభివృద్ధి పనికి నిధులు సమకూరుస్తూ, గ్రామాలు మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు.
కాకర్జాల గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును, జంగమయపల్లి గ్రామంలో రూ.31.50 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును, లోకిరేవ్ గ్రామంలో రూ.12.50 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోవన్ పల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును, ఇప్పటూర్ గ్రామంలో రూ.24.50 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. తీగలపల్లి గ్రామంలో రూ.12.50 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.