27-08-2025 12:45:22 AM
-కార్లలో వచ్చిరాత్రి సమయంలో మేకల చోరీ
-16 మంది సభ్యులు అరెస్ట్
-200లకు పైగా మేకలను దొంగలించిన ముఠా
నల్లగొండ క్రైమ్, ఆగస్టు 26 : ఉదయం రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో కార్లలో వచ్చి మేకల చోరీ చేస్తున్న నాలుగు ముఠాలుగా ఏర్పడిన 16 మంది సభ్యులును జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మంగళవారం మీడియాకు వివరించారు.
26 నేరాలలో 200లకు పైగా మేకలను దొంగలించిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రూ.2.46 లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు సీజ్ చేసినట్టు తెలిపారు. జిల్లాలో కొంతకాలంగా మేకలు, గొర్రెలు దొంగతనం జరుగుతున్న నేపద్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. శాలిగౌరారం పో లీసులు బైరవోనిబండ రోడ్డు వద్ద సోమ వారం వాహన తనిఖీ చేపడుతున్న సమయంలో పోలీసులను చూసి ఒక షిఫ్ట్ డిజైర్ కారులో తప్పించుకొని పోవడానికి ప్రయత్నించారు.
దీంతో పోలీసులు ఆ వాహనాన్ని పట్టుబడించి అందులో ఉన్న వారిని ఫింగర్ ప్రింట్ స్కానర్ తో చెక్ చేయగా వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలిందన్నారు. ఈ కేసులో సంపంగి వెంకటేష్, వెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్ కుమార్ @ కోటిలు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధి లో మేకల చోరీ చేసినట్లు అంగీకరించారు. జిల్లాలో మొత్తం 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకల దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు.
దొంగలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు. 26 నేరాలకు సంబంధించి 200లకు పైగా మేకలను రెండు లక్షల నలబై ఆరు వేల రూపాయల నగదు, 2 లక్ష డ్బ్బుయిదు వేల రూపాయల విలువ గల 22 గొర్రెలు, 47 లక్షల విలువ గల 8 కార్లు సీజ్ చేసిస్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ కె.శివరాం రెడ్డి, సీసీఎస్ సీఐ ఎమ్.జితేంధర్ రెడ్డి, యం.నాగభూషణ్, కె.కొండల్ రెడ్డి, కె.నాగరాజు, యస్‌ఐలు శివ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.