27-08-2025 12:46:42 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
చివ్వెంల ఆగష్టు 26: మండలం లోని గుంపుల తిరుమలగిరిలో పందిరి నవ్య నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించారు.లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితమైన కొలతలతో, ప్రభుత్వం నిర్దేశించిన స్థలములోనే నిర్మించుకోవాలని, స్థానిక మేస్త్రీల తో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, ముందుగా అగ్రిమెంట్ చేసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, దానిని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గుంపుల తిరుమలగిరి లోని ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.9 వ తరగతి కి వెళ్లి విద్యార్థులతో తెలుగు చదివించారు.ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని,కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉంటుందని,కావున ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు.వంట గదిని పరిశీలించారు.వంట గదిలో పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రకాష్ , ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంఈఓ కళారాణి, హెడ్మాస్టర్ బి.శైలజ, హౌసింగ్ ఏఈ ప్రేమలత, పంచాయతీ సెక్రెటరీ, తదితరు పాల్గొన్నారు.