calender_icon.png 8 September, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొవేరా స్మారక ఉపన్యాస పురస్కార ప్రధానం వాయిదా

30-08-2025 06:41:36 PM

బొవేరా సంస్థల అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు

కరీంనగర్,(విజయక్రాంతి): బొవేరా 105వ జయంతి, సారస్వత జ్యోతి మిత్రమండలి స్థాపన దినోత్సవాన్నిపురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ 2న నిర్వహిస్తున్న బొవేరా స్మారక ఉపన్యాసం, కవిత పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు బొవేరా సంస్థల అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అనిశ్చిత వాతావరణ పరిస్థితులు, వినాయక నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ మాసానికి వాయిదా వేసినట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమ ఆహ్వానితులు, అతిథులు,బొవేరా అభిమానులు, ఈ మార్పును గమనించాలని, అసౌకర్యానికి మన్నించాలని కోరారు. తిరిగి ఈ కార్యక్రమం నిర్వాహక తేదీలను పత్రికా ముఖంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.