04-11-2025 12:00:00 AM
							హుజురాబాద్,నవంబర్3:(విజయ క్రాంతి) బాల బాలికల అండర్ 14, అండర్ 17 హాకీ సెలక్షన్స్ను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామై దానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హు జురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈఓ బి శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రెటరీ వేణు గోపాల్ మాట్లాడుతూ.. సుమారుగా ఉమ్మ డి జిల్లాలో 170 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులోనుండి అండర్ 17, అండర్ 14 బాల బాలిక జిల్లా జట్లను ఎంపిక చేశా రు.
ఎంపికైన వారు వనపర్తి లో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు తెలిపారు. గత సంవత్సరం అండర్ 14 హుజు రాబాద్ లో నిర్వహించగా అండర్ 14 బాలికల జట్టు గోల్ మెడల్ సాధించిందని గుర్తు చేశారు మెడల్‌అదేవిధంగా ఎంపికైన క్రీడాకారులు జిల్లాకి గోల్ మెడల్ తీసుకురా వడానికి కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా హాకీ ఎస్ జి ఎఫ్ కన్వీనర్ వేముల రవికుమార్, వీటిలో సత్యానంద్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, అనిల్, శేఖర్ హుజురాబాద్ మాజీ క్లబ్ అధ్యక్షుడు కొల్లిపాక శ్రీనివాస్, హుజురాబాద్ క్లబ్ సెక్రటరీ తిరుపతి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీని వాస్ సీనియర్ క్రీడాకారులు శ్యాంసుందర్, శంకర్ సజ్జు సాయి కృష్ణ,రాజేష్, విక్రమ్, సాంబ, వంశీ,పరబ్రహ్మం తో పాటు తదితరులుపాల్గొన్నారు.