04-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, నవంబర్ 3 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత శిశు హాస్పిటల్ లో నూతనంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా రోగులకు మెరుగైన అత్యవసర చి కిత్సలకు అవకాశం ఉంటుందని ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం మాత శిశు ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంటును ఎమ్మెల్యే పరిశీలించారు.
ఆసుపత్రిలో అందుబాటు లో ఉన్న పడకలు, డ్రగ్స్,స్టాఫ్ హాజరు రిజిస్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకొన్నారు. అనంతం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ విషయం లో కొంత నిధులు అవసరం ఉందని వైద్యాధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.హాస్పిటల్ స్టాఫ్ హాజరు రిజిస్టర్ పరిశీలించి ఆసుపత్రిని తనిఖీ చేశారు.
మాతా శిశు ఆసుపత్రి చుట్టూ పక్కన 4 జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుందని, ఆసుపత్రిని విస్తరించే విధంగా రు.200 కోట్ల తో 230 పడకల ఆసుపత్రి రావడం జరిగిందని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిందని ఎమ్మెల్యే అన్నారు.క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పూర్తి అయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు.ఈ ససమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సునీల్, సూపరిండెంట్ కృష్ణమూర్తి, ఆర్ ఎఓ లు డా. సుమన్ మోహన్ రావు,డా.గీతిక,డా.నవీన్, తదితరులు పాల్గొన్నారు.