calender_icon.png 3 November, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెయిన్ ముస్తాబవుతోంది!

03-11-2025 02:41:09 AM

సస్పెన్స్, క్రైమ్ జోనర్ కథలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ లభిస్తుంటుంది. ఈ క్రమంలో ఎండ్లూరి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి ఓ సస్పెన్స్, క్రైమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ది బ్రెయిన్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకుడు. అజయ్, తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కామరాజ్ మాట్లాడుతూ.. “ది బ్రెయిన్’ చిత్రాన్ని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నాం” అని చెప్పారు. ఈ సినిమా త్వరలోనే అన్ని కార్యక్ర మాలను పూర్తి చేసుకొని, ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: యూఎస్ విజయ్; సంగీతం: ఎంఎల్ రాజా; మాటలు: పోతుగడ్డ ఉమాశంకర్.