03-11-2025 02:42:43 AM
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. తొలిభాగం ఎండింగ్‌లోనే రెండో భాగం ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్2 షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కాతుతోంది. అయితే, ఈ సినిమాపై తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్‌ను భాగం చేయనున్నారని టాక్. రెండోభాగంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటించనున్నట్టు సమాచారం.
ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడు కొరటాల శివ పార్ట్-2 కథలో చాలా మార్పులు చేశారని వినికిడి. ఇందులో భాగంగానే ప్రియాంక చోప్రా పాత్రను క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రలో కనిపించారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, అజయ్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. మొత్తానికి ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టు రెండో భాగం ఎలా ఉంటుంది? కొత్తగా చేర్చిన మరో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.