calender_icon.png 11 May, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్‌కు బ్రేక్?

11-05-2025 01:32:07 AM

-భారత్ యుద్ధం ఎఫెక్ట్

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. కర్రెగు ట్టల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో గత మూడు వారాలుగా సీఆర్పీఎఫ్, ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే భారత్ మధ్య కాల్పులు ప్రారంభమైన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తున్నది. వారి పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో విధులకు కేటాయించే యోచనలో కేంద్ర ఉన్నట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ బలగాలు, కోబ్రా బృందాల్లోని సిబ్బంది వెంటనే కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించినట్లుగా సమాచారు.

సీఆర్పీఎఫ్ బలగాల ను పాక్ సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్, జమ్మూకశ్మీర్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం, వాజేడు, చర్ల ప్రాంతాల నుంచి సీఆర్పీఎఫ్ బృందాలు వెనుదిరిగినట్టు తెలుస్తున్నది. దశల వారీగా భద్రతాదళాలు వెనుదిరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.