22-12-2025 01:35:38 AM
మహబూబాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రైతులకు యాసంగి సీజన్లో యూరియా పంపిణీ కోసం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ విధానాన్ని మహబూబాబాద్ జిల్లాలో సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు గతంలో యూరియా పంపిణీ విధానాన్ని జిల్లాలో కొనసాగిస్తామని, రైతులు పాత పద్ధతిలోనే యూరియా పొందాలని కోరారు.