calender_icon.png 22 December, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే

22-12-2025 01:33:00 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని, ఆయన అసెంబ్లీకి కూడా రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 70 శాతం గెలిచారని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్‌రావు తప్పిదాలతోనే నదీ జాలాల సమస్యలు ఏర్పడ్డాయని, వృథా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చులు చేశారని విమర్శించారు.

ఆదివారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాయడంపై మండిపడ్డారు. మోదీని ప్రశ్నించే సామర్థ్యంలేని  కిషన్‌రెడ్డికి.. సోనియాగాంధీకి లేఖ రాసే హక్కు లేదన్నారు. బడ్జెట్ కేటాయింపు నుంచి అన్ని రంగాల్లో తెలంగాణపై పక్షపాతం చూపిస్తోందన్నారు.

బీజేపీ 12 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చేసిందేమిటో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీశారు.