22-12-2025 01:37:18 AM
లీడ్ బ్యాంక్ మేనేజర్ జి. జయ ప్రకాష్.
ములుగు,డిసెంబర్21(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిదిలో ఆర్దిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగామీ డబ్బు మీ హక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకొని ఆర్ధికపరమైన ఆస్తులు (సొమ్ము) సమస్యను పరిస్కరించేందుకు చేపట్టిన కార్యక్రమము ఈ నెల 31 వరకు కొనసాగుతుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ జి. జయ ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
10 సంవత్సరాలు ఆ పైన క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ పొదుపులు, ఇన్షూరెన్స్ ఖా తాలు , తదితరాలు క్లెయిమ్ చేసుకొనేందుకు వీలు కల్పించాలనే లక్ష్యంతో ఆర్బిఐ ,సెబీ, IRDA, బాంకులు ఉమ్మడి శిబిరాలు నిర్వహిస్తాయిని ఇందులో బాగంగా ఈ నెల 23 వ తారీకున (మంగళవారం) జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్ లో ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరుకు శిబిరం నిర్వహించనట్లు ఎల్ డి ఎం తెలిపారు. ఆర్దిక పరమైన ఆస్తులు వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు శిబిరంలో బ్యాంక్ శాఖ భీమా సంస్తని సంప్రదించి సలహాలు తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.