calender_icon.png 13 September, 2024 | 1:29 AM

వరుస పతనానికి బ్రేక్

08-08-2024 02:47:16 AM

సెన్సెక్స్ 875 పాయింట్లు అప్ l305 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై, ఆగస్టు 7: మార్కెట్ మూడు రోజుల వరుస పతనానికి బుధవారం బ్రేక్ పడింది. భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగింపువరకూ ఆదే ఊపును ప్రదర్శించింది. ఒక దశలో 1,046 పాయింట్ల లాభంతో 79,639 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 875 పాయింట్ల లాభంతో 79,468 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 345  24,338 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన అనంతరం చివరకు 305 పాయింట్ల లాభంతో 24,297  పాయింట్ల వద్ద నిలిచింది.

మెటల్, ఐటీ, ఆయిల్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ జరిగిందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,985 స్టాక్స్ లాభపడగా, 948 క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీ లు ర్యాలీ జరిపాయి. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లు 2 శాతం మేర పెరిగాయి. 

అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్  3.42 శాతం పెరిగింది.  పవర్‌గ్రిడ్ 3.39 శాతం ర్యాలీ జరపగా, టాటా స్టీల్ 2.4 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.61 శాతం చొప్పున పెరి గాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, రిలయ న్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీం ద్రా, మారుతి, లార్సన్ అండ్ టుబ్రోలు లాభపడ్డాయి.

మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, టైటాన్‌లు తగ్గాయి వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండె క్స్  3.75 శాతం పెరిగింది. మెటల్ ఇండెక్స్ 3.44 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 3.32 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.89 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 2.80 శాతం, సర్వీ సుల సూచి 2.53 శాతం, కమోడిటీస్ ఇండె క్స్ 2.49 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 2.03 శా తం చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.63 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.39 శాతం చొప్పున పెరిగాయి. 

బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊరట

ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెంచబోమని బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీఓజే) డిప్యూటీ గవర్నర్ హామీ ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లకు ఊరట లభించింది. ఒకవైపు అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలు, మరోవైపు బీఓజే వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఆందోళనలతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ రోజున జపాన్ నికాయ్ సూచి 20 శాతం పడిపోయింది.

అయితే మంగళ, బుధవా రాల్లో జపాన్ మార్కెట్ 15 శాతం వరకూ రికవరీ అయ్యింది. దీంతో ఆసియా, యూరప్ సూచీలు పెరిగిన నేపథ్యంలో భారత్ మార్కెట్ సైతం ర్యాలీ జరిపిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. దాదాపు అన్ని రంగాల షేర్లూ ర్యాలీలో పాలుపంచుకున్నాయని, రియల్టీ ఆస్తుల విక్రయాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని పునర్ కల్పించడంతో రియల్టీ షేర్లు వెలుగులో ఉన్నాయని తెలిపారు.