19-09-2025 12:29:38 AM
జిన్నారం, సెప్టెంబర్ 18 :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బొల్లారం మున్సిపల్ పరిధిలో గురువారం బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీ నగర్ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలను, రోడ్లను స్థానికులతో కలిసి బీజేపీ నాయకులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ అఖిల్,నాయకులు సంతోష్, సురేందర్, మోహిత్, సురేష్, బన్నీ, ధనుంజయ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.