calender_icon.png 19 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యాలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా బాగుండాలి

18-09-2025 11:44:12 PM

ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల..

నకిరేకల్ (విజయక్రాంతి): ముత్యాలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో అష్ట, ఐశ్వర్యాలతో బాగుండాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. గురువారం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగకు హజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా తమ మొక్కులను, బోనాలను అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.