calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ

19-09-2025 12:32:07 AM

వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు

డిచ్పల్లి, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమెన్ సెల్ డైరెక్టర్  ప్రొఫెసర్ బ్రమరాంబిక  ఆధ్వర్యంలో గురువారం ఇంజనీరింగ్ కళాశాల  ప్రాంగణంలో   బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్. టి. యాదగిరిరావు ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి  అతిథిగా హాజరై బతుకమ్మలకు  పసుపు కుంకుమ సమర్పించినారు.

అనంతరం వైస్ ఛాన్స్లర్ టి యాదగిరిరావు  బతుకమ్మ సంబరాలకు హాజరైన విశ్వవిద్యాలయ టీచింగ్ నాన్ టీచింగ్  మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ముఖ్యమైన పండుగని, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీల ఐక్యతను, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందన్నారు. రంగు రంగుల పూలతో గౌరమ్మను పేర్చి, తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో జరుపుకొని చివరిరోజు పూలను నీటిలో వదులుతారన్నారు.

ఈ పండుగ స్త్రీల స్ఫూర్తికి, తెలంగాణ సాంస్కృతిక  ప్రతీక అన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి వనరులను కాపాడటం వంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తుందని అభిప్రాయపడ్డారు.  ఈ కార్యక్రమంలో  ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, డీన్ ప్రొఫెసర్ కే లావణ్య, ప్రొఫెసర్ శాంతాబాయి, ప్రొఫెసర్ వాణి, ప్రొఫెసర్ ప్రసన్న శీలా, ప్రొఫెసర్ రాజేశ్వరి,జ్యోతి, ఉమారాణి తదితర సిబ్బంది విద్యార్థినీలు పాల్గొన్నారు.